అనంతపురం: గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయుల దాష్టీకానికి దిగారు. వైయస్సార్‌సీపీ నేత రామాంజనేయరెడ్డిని టీడీపీ మూకలు కిడ్నాప్ చేశారు. గుత్తి మండలం ఊబిచర్ల గ్రామానికి చెందిన రామాంజనేయ రెడ్డి.. సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులతో నామినేషన్లు వేయించారు. వైఎస్సార్‌సీసీకి మద్దతు ఇచ్చారన్న కారణంతో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు కిడ్నాప్ చేశారు. పాతకొత్తచెరువు గ్రామంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ మూకలు దాడి దౌర్జన్యానికి దిగారు. వెంకటేశ్వర్లు ఇంట్లో లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. జయరాం వర్గీయుల గూండాగిరిపై ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు పట్టించుకోలేదు. గుమ్మనూరు జయరాం వర్గీయుల గూండాగిరి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.