అట్టహాసంగా మైల దివ్యవాణి నామినేషన్ 

 అశేష జనవాహిని మధ్య ఘనంగా నామినేషన్ కార్యక్రమం 

 కృష్ణా జిల్లా: కృత్తివేను మండల పరిధిలోని చిన్న గొల్లపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైయ‌స్ఆర్‌సీపీ బలపరిచిన మైల దివ్యవాణి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తరలిరావడంతో నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా సాగింది.

మైల దివ్యవాణికి మద్దతుగా అశేష జనవాహిని పాల్గొని సంఘీభావం తెలిపింది. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం వైయ‌స్ఆర్‌సీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార కమిటీ జోన్‌-3 అధ్యక్షురాలు మైల రత్నకుమారి పిలుపునిచ్చారు. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలకు మైల రత్నకుమారి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మైల దివ్యవాణికి లభిస్తున్న ప్రజా మద్దతు విజయానికి మరింత బలాన్ని చేకూరుస్తోందని పేర్కొన్నారు.

Back to Top