అప్రజాస్వామ్య పద్ధతుల్లో వైస్ చైర్మన్ పీఠం

 క్యాంప్ రాజకీయాలు, ప్రలోభాలతో టీడీపీ కుట్రలు: శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి 

 నంద్యాల: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ అప్రజాస్వామ్య పద్ధతులకు పాల్పడి పదవిని కైవసం చేసుకుందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి 27 మంది కౌన్సిలర్ల మెజారిటీ ఉన్నప్పటికీ క్యాంప్ రాజకీయాలు, ప్రలోభాలతో అధికార పార్టీ కుట్రలకు పాల్పడిందని మండిపడ్డారు.

వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిని సమావేశానికి రాకుండా అడ్డుకున్నారని, ఆయన ఆచూకీ, ఎక్కడ ఉంచారు, బెదిరింపులకు లేదా ప్రలోభాలకు గురిచేశారా అనే అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ కౌన్సిలర్‌కు ఎంపీ శబరి చేతిని పైకి ఎత్తి మద్దతు తెలిపించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు.

నందికోట్కూరులో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఎంపీ నంద్యాలలో ఓటు వేయడం, కొత్త జీవోల ద్వారా చైర్మన్‌కు అదనపు ఓటు హక్కు కల్పించడం వంటి చర్యలతో టీడీపీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుందని శిల్పా రవిరెడ్డి విమర్శించారు. ప్రలోభాలకు లొంగకుండా నిలిచిన వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లను అభినందించారు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు: ఇసాక్ బాషా

మెజారిటీ ఉన్న వైయ‌స్ఆర్‌సీపీని కాదని క్యాంప్ రాజకీయాలతో టీడీపీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ మరింత బలోపేతమై తిరిగి అధికారంలోకి వస్తుందని తెలిపారు.

Back to Top