పల్నాడు జిల్లాలో నామినేషన్‌కు అడ్డంకులు

ఇస్సాపాలెంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

పల్నాడు జిల్లా: నరసరావుపేట మండలం ఇస్సాపాలెంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తుండగా అడ్డుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలు చేసే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లు, అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేలా ఎన్నికల అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరాయి.

Back to Top