పొన్నూరులో నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి బీబీజాన్ నాసర్ నామినేషన్ తిరస్కరణపై అంబటి మురళీకృష్ణ ఆగ్రహం

గుంటూరు జిల్లా: పొన్నూరు మున్సిపాలిటీ నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి బీబీజాన్ నాసర్ నామినేషన్ తిరస్కరించడంపై వైయ‌స్ఆర్‌సీపీ నేత అంబటి మురళీకృష్ణ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆయనను కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది.

బీబీజాన్ నాసర్ నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించారంటూ అంబటి మురళీకృష్ణ అధికారులను ప్రశ్నించారు. నామినేషన్ తిరస్కరణకు కారణాలను స్పష్టం చేయాలని కోరారు. ఈ క్రమంలో పోలీసులు అంబటి మురళీకృష్ణను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు సంబంధించిన కారణాలను స్పష్టంగా వెల్లడించాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరాయి.

Back to Top