అనంతపురం జిల్లా: రామగిరి మండలం నసనకోట పంచాయతీకి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న కాంత అనే యువకుడిని రెండు రోజులుగా టీడీపీకి చెందిన వ్యక్తులు అడ్డుకుంటున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. నామినేషన్ వేయించేందుకు కాంతను తీసుకెళ్తున్న తనను కూడా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్నారని గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించాల్సిన పోలీసులు, వారినే అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. నసనకోటలో కాంత నామినేషన్ దాఖలు చేసేలా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా జరిగేలా చూడాలని వైయస్ఆర్సీపీ కోరింది.