తాడేపల్లి: క్రికెట్ మెంటార్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్న ఎంఎస్ ధోనికి వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ధోని.. మెంటార్ కొత్త బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘రాంచీలో ఓ సామాన్య కుటుంబం నుంచి ధోని ప్రస్థానం ప్రారంభమైంది. అది క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన క్రీడాకారునిగా ఎదిగే వరకు కొనసాగింది. పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలకు ధోనీ ప్రయాణం నిలువెత్తు నిదర్శనం. కేవలం ట్రోఫీలే కాదు.. జట్టు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడి జట్టును ముందుండి నడిపించిన నాయకుడు ధోనీ. ఒత్తిడిని తనపై వేసుకుంటూ.. చిరునవ్వుతో జట్టుకు దిశానిర్దేశం చేసిన అసాధారణ కెప్టెన్. తన అద్భుతమైన ఆటతీరుతో, నాయకత్వ పటిమతో భావితరాలకు స్ఫూర్తినిచ్చారు. ధోనీ సాధించిన విజయాలు, అందించిన స్ఫూర్తి క్రికెట్ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపడుతున్న ధోనీకి శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయనకు మరిన్ని విజయాలు, సంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తున్నా’ అని శుభాకాంక్షలు తెలియజేశారు వైయస్ జగన్.