వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌ను అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా 2026 నవంబర్ 28న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన కార్యక్రమం ‘చలో రాంలీలా మైదాన్’కు సంఘీభావం, మద్దతు ప్రకటించడంతో పాటు కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరుకావాలని వైయస్ జగన్‌ను ఆహ్వానించారు. కుల గణన అంశంపై నిర్వహించనున్న ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి మద్దతుగా నిలవాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో వైయస్ జగన్ పాల్గొని తమకు సంఘీభావం తెలపాలని వారు ఆహ్వానం అందించారు.