పల్నాడు జిల్లా: అమరావతి మండలం మునుగోడులో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ నేతలను టీడీపీ వర్గాలు అడ్డుకున్నాయని పార్టీ నేతలు తెలిపారు. నామినేషన్ కేంద్రం వద్ద 400 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు గుమిగూడి, మారణాయుధాలతో అక్కడే ఉన్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. నామినేషన్లు వేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నా పోలీసులు స్పందించకుండా వైయస్ఆర్‌సీపీ నేతలను అడ్డుకున్నారని ఆరోపించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న తమ నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ నేతలు మునుగోడులో ధర్నాకు దిగారు. నామినేషన్ ప్రక్రియను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు కోరారు.