నెల్లూరు జిల్లా: ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైయస్ఆర్‌సీపీ నేత మేకపాటి అభినవ్‌రెడ్డి అన్నారు. పలు ఎన్‌పీటీసీ, జెడ్‌పీటీసీ స్థానాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఫలితాలను నిలిపివేయడం, ఎన్నికల అధికారులు ఫలితాలను తారుమారు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మీడియాను అనుమతించకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ప్రజాతీర్పును అధికారిక ప్రకటనలతో మార్చలేరని అభినవ్‌రెడ్డి స్పష్టం చేశారు. అధికారికంగా విజయం ప్రకటించినంత మాత్రాన ప్రజల విశ్వాసాన్ని సృష్టించలేరని, ఉదయగిరి ప్రజలు జరిగిన పరిణామాలను మరచిపోరని అన్నారు. వైయస్ఆర్‌సీపీ తరఫున పోటీ చేసిన 83 ఎన్‌పీటీసీ, 8 జెడ్‌పీటీసీ అభ్యర్థులు తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపుల మధ్య ధైర్యంగా పోరాడారని, గెలిచిన చోట స్పష్టమైన మెజారిటీలతో గెలిచామని, ఓడిన చోట కూడా స్వల్ప తేడాలతోనే ఫలితాలు వచ్చాయని తెలిపారు. ప్రజల మద్దతు వైయస్ఆర్‌సీపీకి ఉందని పేర్కొంటూ, ప్రజాస్వామ్యం, న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జగనన్న నాయకత్వం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన అభినవ్‌రెడ్డి, ఒత్తిళ్లను లెక్కచేయకుండా నిలిచిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు, ఉదయగిరి ప్రజలు, ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల గొంతును శాశ్వతంగా అణచివేయడం సాధ్యం కాదని, తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.