ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి అరాచకాలు

 మెజారిటీ ఉన్న ఎంపీటీసీలను ప్రలోభాలు, బెదిరింపులతో తమవైపు తిప్పుకునే కుట్ర 

అన్న‌మ‌య్య జిల్లా: మదనపల్లె నియోజకవర్గంలో ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రామసముద్రం, నిమ్మనపల్లె, మదనపల్లె మండలాల ఎన్నికల కేంద్రాల వద్దకు వెళ్లవద్దంటూ మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ మదనపల్లె సమన్వయకర్త ఎస్.నిసార్ అహమ్మద్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ.. “ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నామినేషన్‌ నుంచి ఎంపీపీ ఎన్నిక వరకు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. మెజారిటీ ఉన్న మా ఎంపీటీసీలను ప్రలోభాలు, బెదిరింపులతో తమవైపు తిప్పుకుని ఎంపీపీ ఎన్నికలు నిర్వహించడమేనా ప్రజాస్వామ్యం? ఎన్నికల కేంద్రాల వద్దకు మమ్మల్ని వెళ్లనివ్వకుండా నోటీసులు ఇవ్వడం ఎందుకు?” అని ప్రశ్నించారు.

Back to Top