హోంమంత్రికి ఊహించని షాక్

అనిత సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు ఎంపీటీసీలు

24 గంటలు గడవకముందే వైయ‌స్ఆర్‌సీపీలోకి తిరిగి చేరిక 

అనకాపల్లి జిల్లా: నక్కపల్లి మండలంలో హోంమంత్రి అనితకు ఊహించని పరిణామం ఎదురైంది. మంత్రి సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీలు 24 గంటలు గడవకముందే తిరిగి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వీసం నానాజీ, వీసం దేవి టీడీపీని వీడి తిరిగి వైయ‌స్ఆర్‌సీపీలోకి వచ్చారు. వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని హామీ ఇచ్చి వీసం నానాజీని టీడీపీలోకి చేర్చుకున్నారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి. అయితే జరిగిన పరిణామాలపై వీసం నానాజీ స్పందిస్తూ.. టీడీపీలో ఎంపీటీసీలు చేరడం దురదృష్టకరమైన ఘటన అని, జరిగిన ఘటనకు క్షమాపణలు చెబుతున్నామని పేర్కొన్నారు. పార్టీ కేడర్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

అనంతరం వీసం రామకృష్ణ ఇద్దరు ఎంపీటీసీలకు వైయ‌స్ఆర్‌సీపీ కండువా వేసి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి అనిత సమక్షంలో పార్టీ మారిన ఇద్దరు ఎంపీటీసీలు ఒక్కరోజు కూడా గడవకముందే తిరిగి వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం నక్కపల్లి మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Back to Top