నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉయ్యాలవాడ మండలం పెద్దయమ్మనూరు గ్రామంలో వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ వెంకటరాముడిని కిడ్నాప్ చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో భూమా అఖిలప్రియ వర్గీయులు వెంకటరాముడిని తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంపీటీసీ వెంకటరాముడు కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేసి వెంకటరాముడిని వెంటనే గుర్తించి తమకు అప్పగించాలని కోరారు. ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో ఉయ్యాలవాడలో ఉద్రిక్తత నెలకొంది.