నామినేషన్ పత్రాలు చించేసిన టీడీపీ నేతలు

 బొందలవాడలో వైయ‌స్ఆర్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిపై దౌర్జన్యం.. పట్టించుకోని పోలీసులు 

అనంతపురం జిల్లా:  శింగ‌ణ‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం నార్పల మండలం బొందలవాడలో వైయ‌స్ఆర్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి భావన నామినేషన్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ పత్రాలను టీడీపీ నేతలు చించివేసి, వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడి చేసి నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారు. టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం పట్ల వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top