వైయస్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరుకు చెందిన రెండేళ్ల చిన్నారి వర్షిత్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఖండరాల ఎదుగుదలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు సుమారు రూ.1.30 కోట్ల ఖర్చుతో మలేషియాలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. చిన్నారి వర్షిత్ వైద్యానికి వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించనున్నట్లు రాచమల్లు తెలిపారు. వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 21న వర్షిత్‌కు కీలకమైన ఇంజక్షన్ వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. చిన్నారి ప్రాణాలు నిలబెట్టేందుకు రూ.1.30 కోట్ల వరకు ఖర్చవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమకు తోచినంత ఆర్థిక సాయం అందించి వర్షిత్ కుటుంబానికి అండగా నిలవాలని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కోరారు.