హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయలేని స్దితిలో ఎస్ఈసీ

వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నా స్పందించట్లేదు

 తాను తవ్వుకున్న గోతిలోనే చంద్రబాబు పడటం ఖాయం

 వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు స్పష్టీకరణ

తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు

 సిట్టింగ్ ఎంపీల్ని సైతం లెక్కచేయకుండా దాడులు

 వైఎస్ అవినాష్ రెడ్డిపై పెట్రోల్ బాంబులేయడం దారుణం

 పోలీసుల సమక్షంలోనే పెద్దారెడ్డి ఇల్లు తగులబెట్టారు

 టీడీపీ గూండాల దాడులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి

 జూపూడి ప్రభాకర్ రావు ఫైర్

 చంద్రబాబు చేతిలో వస్తువులా మారిపోయిన ఎస్ఈసీ

 హైకోర్టు ఆదేశాలూ లెక్కచేయని ఎన్నికల కమిషనర్

 ముగ్గురు సిట్టింగ్ ఎంపీల్ని టార్గెట్ చేస్తున్నా అదే మౌనం

 ఇవాళ ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అందుబాటులో లేరు

 జూపూడి ప్రభాకర్ రావు ఆక్షేపణ

 రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా మార్చేసిన చంద్రబాబు

 ఓవైపు క్వాంటం కబుర్లు, మరోవైపు విపక్షంపై దాడులు 

 చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

 నాజీ హిట్లర్ కు పట్టిన గతే మీకూ పట్టడం ఖాయం

 హెచ్చరించిన జూపూడి ప్రభాకర్ రావు

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, సిట్టింగ్ ఎంపీలపై వెన్నుపోటు పార్టీ గూండాలు చెలరేగిపోతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చోద్యం చూడటం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాల్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల కమిషనర్ పునేఠా మౌనంగా ఉండిపోవడం చంద్రబాబుతో కుమ్మక్కుకు నిదర్శనం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని, లేకపోతే హిట్లర్ వంటి నియంతలకు పట్టిన గతే ఆయనకూ పడుతుందని జూపూడి ప్రభాకర్ రావు హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జూపూడి ప్రభాకర్ రావు ఇంకేమన్నారంటే...

- సిట్టింగ్ ఎంపీలపై పెట్రోల్ బాంబులతో దాడులా ?

స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం వైఎస్సార్సీపీ విపక్ష పార్టీగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాస్వామ్యానికి ఓ వైపు పాలకపక్షం, రెండోవైపు ప్రతిపక్షం ఉండాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. టీడీపీ గూండాల దాడులకు ఎదురొడ్డి వైఎస్సార్సీపీ మద్దతిచ్చిన అభ్యర్ధులతో నామినేషన్లు వేయించేందుకు మా ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మా పార్టీ మద్దతిచ్చిన అభ్యర్ధులతో నామినేషన్లు వేయించేందుకు వెళ్తుంటే దాడులు చేసి, పెట్రోల్ బాంబులు విసిరి భయోత్పాతం సృష్టించేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారు. ఈ దాడులను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని బతికించాలనుకుంటున్నారా? లేక చంపాలనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం చెప్పాలి. చంద్రబాబు కళ్లలో తృప్తి కోసం పోలీసులు,  ఎన్నికల అధికారులు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు, మేధావులు కూడా వెన్నుపోటు పార్టీ తీరును ఖండించాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నియమించిన ఎన్నికల కమిషనర్ ఉన్నా ఇలాంటి దాడులకు తెగబడలేదు. చంద్రబాబు రాజకీయ స్వార్ధం, రాజకీయ అవసరాల కోసం ఎన్నికల కమిషన్ ను విచ్చలవిడిగా కార్యకర్తలా వాడేస్తున్నారు. చంద్రబాబు చేతిలో ఓ లాఠీలా, ఓ ఫోన్ లా, ల్యాప్ ట్యాప్ లా ఎన్నికల కమిషనర్ పనిచేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థ ఈ రోజు ఎటుపోతోంది? వంగివంగి దండాలు పెట్టే పరిస్ధితికి ఎన్నికల కమిషనర్ వెళ్లొద్దన్ని కోరుతున్నాం. హైకోర్టు ఆదేశాల్ని సైతం లెక్కచేయకుండా మీరు మిన్నకుండిపోతున్నారు. 

- చంద్రబాబు అటు డిజిటల్ కబుర్లు, ఇటు దాడులు 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పరామర్శించడానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెళ్తుంటే ఆయన్ను అడ్డుకుని దాడులకు దిగారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో మా ముగ్గురు ఎంపీల మీద వీళ్లు దాడులకు దిగుతున్నారు. ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, మిథున్ రెడ్డి గారి మీద వెన్నుపోటు పార్టీ దాడులు చేస్తోంది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని పోలీసుల సమక్షంలోనే తగులబెట్టారు. వైఎస్సార్సీపీకి అనుబంధంగా నామినేషన్లు వేసేందుకు వస్తున్న వారికి రక్షణ కల్పించాలని హైకోర్టు చెప్పింది. కానీ ప్రభుత్వం తమ అవసరాలకు అనుగుణంగా నియమించుకున్న వారిని, అందుకు అనుగుణంగానే పనిచేయాలని ఒత్తిడి తెస్తోంది. ఓవైపు డిజిటల్ టెక్నాలజీ తెస్తున్నట్లు చెప్పుకునే చంద్రబాబు.. విపక్షాలపై దాడులతో రాష్ట్రాన్ని పాత రాతి యుగంలోకి తీసుకెళ్తున్నారు. లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం ఎదగడం లేదంటారు, మొన్నటికి మొన్న సీఐఐ సదస్సు జరిగితే ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పగలరా ? రాష్ట్రాన్ని డిజిటల్ నుంచి జంగిల్ వైపుకు తీసుకెళ్తున్నారు. చెప్పేది డిజిటల్, చేసేది దాడులు. మాట్లాడితే క్వాంటం వ్యాలీ వస్తోంది అంటారు. కానీ రాష్ట్రంలో చేస్తోంది క్వారల్స్ అంటే తగాదాలు. రాష్ట్రంలో చంద్రబాబు కొత్త పదాలు కనిపెడుతున్నారు. విశాఖలో బే టెక్ సిటీ తెస్తారట. కానీ మరోవైపు మీ కార్యకర్తలతో పెట్రోల్ బాంబులు వేయిస్తున్నారు. విభజన తర్వాత రాష్ట్రాన్ని ప్రజలు మీ చేతిలో పెడితే ఈ పదేళ్లలో ఎటు తీసుకెళ్లారు?, రాజ్యాంగం అన్నా, హైకోర్టు అన్నా, ఎన్నికల కమిషన్ అన్నా మీకు లెక్కలేదు. ఇన్ని అంశాల మధ్య మీరు వైఎస్సార్సీపీని ఓ భూతంలా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మీకు, మీ కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయకపోతే రాత్రి నిద్ద పట్టడం లేదు. పొద్దున లేచినప్పటి నుంచీ మీటింగ్స్, సెలబ్రిటీ సదస్సులతో వేల కోట్లు తగలేస్తున్నారు. కానీ లా అండ్ ఆర్డర్ మాత్రం నిర్వహించలేకపోతున్నారు. డీజీపీ ప్రభుత్వానికి ఓ పప్పెట్ లా తయారయ్యారు. ఎస్ఈసీ హైకోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా, దాడులు జరుగుతున్నా మౌనంగా ఉండిపోతున్నారు. పులివెందులలో మురళీనాయక్ అనే డీఎస్పీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. రేపు మేం అధికారంలోకి వస్తే ఆయన పరిస్ధితి ఏంటన్నది కూడా ఆలోచించడం లేదు. ఓ ప్రభుత్వ సేవకుడిగా ఆయన తగిన వ్యక్తా కాదా అన్నది తేల్చుకోవాలి. పోలీసు యూనిఫాంను దేని కోసం అడ్డుపెట్టుకుంటున్నారో చెప్పాలి. 

- తీరు మార్చుకోకపోతే చంద్రబాబుకూ నియంతల గతే

వీటన్నింటినీ కంట్రోల్ చేసి మేం వైయస్.జగన్  గారిని నియంత్రించాం అనుకుంటున్నారేమో, కానీ మీరు తీసుకున్న గోతిలో మీరే పడక తప్పదన్న విషయం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. నాజీ హిట్లర్ నుంచి తీసుకుంటే ఎన్నో దేశాల్లో నియంతలు విజయవంతమైన చరిత్ర ఎక్కడా లేదు. అదే గతి చంద్రబాబుకూ పట్టడం ఖాయం. ప్రభుత్వమే స్థానిక సంస్థల్ని బుల్ డోజ్ చేసుకుంటూ పోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్సార్సీపీ ఉండటానికి వీల్లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇదేనా మీ రాజకీయ చరిత్ర? మీ మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు. అలాగే వైఎస్సార్సీపీ ఓ వేటుతో పక్కకు తప్పుకుంటుందని అనుకుంటున్నారేమో, ఆ పప్పులేం ఉడకవు. ఓట్లేసిన ప్రజల్ని లెక్కచేయకుండా ఏకపక్షంగా వెళ్తున్న మిమ్మల్ని చర్నాకోలా పట్టుకుని నియంత్రించేందుకు వైఎస్సార్సీపీ సిద్దంగా ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి మీద మీరు పెట్రోల్ బాంబులేస్తున్నారు. కడప ప్రజలు ఒరిజినల్ బాంబులు చూసిన వాళ్లే. వాళ్లను ప్రశాంతంగా బతకనివ్వండి. ప్రజాస్వామ్య విరుద్దంగా పాలిస్తే మీ రోజులు దగ్గరపడ్డాయని వైఎస్సార్సీపీ గుర్తుచేస్తోంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎస్ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు మీద మా నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆయన అందుబాటులో లేరు. వైఎస్ అవినాష్ రెడ్డి మీద పెట్రోల్ బాంబులేస్తుంటే, అందుకు కారకుల్ని అరెస్టు చేయకుండా మీనమేషాలు లెక్కపెడుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఎస్ఈసీ తిరుపతిలో జిల్లాఎస్పీలు, కలెక్టర్లతో భేటీ అయ్యారు. ఇందులో వారికి ఏం సందేశం ఇచ్చారు? ఈ ఎన్నికల్లో స్వైరవిహారం చేయమని చెప్పారా లేక హైకోర్టు ఆదేశాలు అమలు చేయమని చెప్పారా ? బయటపెట్టాలి. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ వైపు నడిపించి, ఇప్పుడు పెట్టుబడులు రావట్లేదని, అందుకు జగన్మోహన్ రెడ్డి కారకుడని మీరు చేస్తున్న దుష్ర్పచారాన్ని ప్రజలు అర్దం చేసుకుంటున్నారని జూపూడి ప్రభాకర్ రావు తేల్చిచెప్పారు.

Back to Top