పులివెందులలో కొనసాగుతున్న టీడీపీ గూండాల బీభత్సం

బలపనూరు, వేంపల్లి, చంద్రగిరిలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు నామినేషన్‌ అడ్డంకులు

 
వైయ‌స్ఆర్ జిల్లా: పులివెందుల నియోజకవర్గంలో నామినేషన్ల చివరి రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బలపనూరులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను టీడీపీ మూకలు చించేశాయని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి. నామినేషన్‌ కేంద్రంలోకి అభ్యర్థులను పోలీసులు వదిలేయగా, అప్పటికే అక్కడ తిష్ట వేసిన టీడీపీ వర్గాలు నామినేషన్‌ పత్రాలను చించేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని పేర్కొన్నాయి.

వేంపల్లిలోనూ నామినేషన్లకు అడ్డంకులు

వేంపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులు నామినేషన్లు వేయకుండా టీడీపీ వర్గాలు అడ్డుకున్నాయని, రక్షణ కల్పించాలని అభ్యర్థులు పోలీస్‌స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. రెండు గంటలుగా పోలీస్‌స్టేషన్‌లో ఉన్నా పోలీసులు స్పందించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్లకు చివరి రోజు కావడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

కమ్మఖండ్రిగలో నామినేషన్‌ పత్రాలు లాక్కొని పరారీ

చంద్రగిరి నియోజకవర్గం కమ్మఖండ్రిగలో వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుడు రాజేంద్రనాయుడు నామినేషన్‌ వేయకుండా టీడీపీ వర్గాలు అడ్డుకున్నాయని తెలిపారు. నారా ఉదయ్‌, వేణులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజేంద్రనాయుడు.. తన నామినేషన్‌ పత్రాలను టీడీపీ గూండాలు లాక్కొని వాహనంలో పరారయ్యారని పేర్కొన్నారు.

Back to Top