దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి 

 పుట్లూరు మండలం నాది.. అభివృద్ధి అంటే శైలజానాథ్ 

అనంత‌పురం: వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను కలవడానికి వెళ్లిన సింగనమల నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్‌ను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండ సృష్టిస్తుంటే వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు, తమ పర్యటనను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

తాను అభివృద్ధి పనులు చేపట్టిన సమయంలోనూ కొందరు అడ్డంకులు సృష్టించారని, అయినప్పటికీ అభివృద్ధి చేసి చూపించానని శైలజానాథ్ గుర్తు చేశారు. తనను చూసి టీడీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తూ, ఓటమి భయంతోనే పోలీసులను అడ్డుపెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల పర్యటనలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని, రానున్న రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని శైలజానాథ్ ధీమా వ్యక్తం చేశారు. తనను భయపెట్టాలని చూస్తే అడ్డుకునే వారికే నష్టం కలుగుతుందని హెచ్చరించారు.

Back to Top