“ఎన్‌కౌంటర్ చేస్తా.. కేసులు పెడతా”

గిద్దలూరులో సీఐ బెదిరింపుల ప‌ర్వం

తహశీల్దార్‌ను ఆశ్రయించిన వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకుడు 

ప్రకాశం జిల్లా:  గిద్దలూరు మండలం దొడ్డంపల్లి గ్రామానికి చెందిన వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకుడు కృష్ణారెడ్డి స్థానిక సీఐ కె.సురేష్ తనను బెదిరిస్తున్నారని తహశీల్దార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఘటన కలకలం రేపింది. ఎన్నికల సమయంలో తనను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి “ఎన్‌కౌంటర్ చేస్తా.. కేసులు పెడతా.. మీ అభ్యర్థితో రాజీనామా చేయించు” అంటూ బెదిరిస్తున్నారని కృష్ణారెడ్డి ఆరోపించారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కారణంగానే వేధింపులకు గురవుతున్నానని తహశీల్దార్ ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడిని బెదిరించడం సరికాదని వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, కృష్ణారెడ్డికి రక్షణ కల్పించాలని కోరారు. ఎన్నికల సంఘం కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top