సిక్కు సోదరులకు వైయ‌స్‌ జగన్‌ శుభాకాంక్షలు

ప్రేమ, శాంతి, సమానత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు గురునానక్ 

తాడేపల్లి: గురునానక్‌ జయంతి సందర్భంగా సిక్కు సోదర, సోదరీమణులకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మానవులంతా ఒక్కటేనని బోధిస్తూ ప్రేమ, శాంతి, సమానత్వం వంటి గొప్ప మానవీయ విలువలను కులమతాలకు అతీతంగా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు గురునానక్‌ అని పేర్కొన్నారు.

గురునానక్‌ జయంతి సందర్భంగా సిక్కు సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Image

Back to Top