తాడేపల్లి: స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. బ్రిటీష్ పాలకుల నిరంకుశత్వాన్ని ఎదిరించి ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని వైయస్ జగన్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టుకోవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని తెలిపారు. మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు వైయస్ జగన్ పేర్కొన్నారు.