బనగానపల్లిలో రెచ్చిపోయిన పచ్చమూకలు

కుటుంబ సభ్యులను దూషించడంపై ప్రశ్నించినందుకు దాడి

నంద్యాల జిల్లా: బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలం పెరుసోముల గ్రామంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. గ్రామ 8వ వార్డు సభ్యురాలు, వైయ‌స్‌ఆర్‌సీపీ సానుభూతిపరురాలు భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తుండగా టీడీపీ నాయకుడు, మండల జడ్పీటీసీ బెలుం వరలక్ష్మి భర్త బెలుం సురేంద్రనాథ్‌రెడ్డి అసభ్యంగా దూషించినట్లు వైయ‌స్‌ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి. తన మరదలు, కుటుంబ సభ్యులను ఎందుకు దూషించారంటూ ప్రశ్నించిన గొల్ల కడియం కంబగిరిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

దాడిలో గాయపడిన కంబగిరిని బంధువులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కంబగిరి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులపైనా టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలు తెలిపారు. ఈ ఘటనను బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన కంబగిరిని పరామర్శించి, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు చిన్నబాబు, సిద్ధంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Back to Top