తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గంలో నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లు చేసుకున్న అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అండగా నిలిచారు. అప్పీళ్ల విచారణ పూర్తయ్యే వరకు రాత్రంతా అక్కడే ఉండి అభ్యర్థుల సమస్యలను తెలుసుకున్నారు. వర్షం కురుస్తున్నా, అర్ధరాత్రి దాటినా ఆయన అక్కడి నుంచి కదలకుండా అభ్యర్థులతో పాటు ఉన్నారు. ఒక్కో అభ్యర్థిని పేరు పేరునా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పీళ్ల విచారణ ఏ దశలో ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అభ్యర్థులకు ధైర్యం చెప్పారు. తెల్లవారుజాము 5.10 గంటల వరకు అప్పీళ్ల విచారణ పూర్తయ్యేంత వరకు అక్కడే నిరీక్షించారు. అభ్యర్థుల కష్టాన్ని తన బాధ్యతగా తీసుకుని, వారి కోసం రాత్రంతా వేచి ఉండటం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వానికి నిదర్శనంగా నిలిచిందని వైయస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొన్నాయి.