తాడేపల్లి : రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, పల్నాడు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోవడంపై వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఐదుగురు, విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో ఇద్దరు, పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమని వైయస్ జగన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.