వైయ‌స్‌ఆర్‌సీపీ మద్దతు అభ్యర్థుల ప్రచారం

 అనంతపురం రూరల్‌లో సునీత, ముంతాజ్ బేగంకు మద్దతుగా ప్రచారం 

అనంతపురం:  రూరల్‌ పరిధిలో వైయ‌స్‌ఆర్‌సీపీ మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూడేటి సునీత, 9వ వార్డు అభ్యర్థి ముంతాజ్‌ బేగం తరఫున కట్టుబడి తానీషా ప్రచారం నిర్వహించారు. సర్పంచ్‌ అభ్యర్థి సునీత ఎన్నికల గుర్తు వంకాయ, 9వ వార్డు అభ్యర్థి ముంతాజ్‌ బేగం ఎన్నికల గుర్తు స్టూల్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతపురం అర్బన్‌ పరిధిలోని రుద్రంపేట పంచాయతీ వికలాంగుల కాలనీలో వైయ‌స్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం లభించిందని ప్రజలకు వివరించారు.

రుద్రంపేట పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి లక్ష్మీనారాయణ ఎన్నికల గుర్తు ఉంగరానికి ఓటు వేసి గెలిపించాలని, వైయ‌స్‌ఆర్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న వార్డు సభ్యుల అభ్యర్థులను కూడా గెలిపించాలని అనంత వెంకటరామిరెడ్డి ప్రజలను కోరారు.

Back to Top