శ్రీ సిటీ ప్రమాదంపై వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి 

తాడేపల్లి: తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో నలుగురు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించి, వారు త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వైయ‌స్‌ జగన్‌ కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top