డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డికి ఘన నివాళులు

పులివెందులలో గంగిరెడ్డి వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

వైయ‌స్ఆర్ జిల్లా:  డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి వర్ధంతి వేడుకలను పులివెందులలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వైయ‌స్ఆర్‌ సమాధుల తోటలో ఉన్న డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఘాట్‌ వద్ద ఆయన కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైయ‌స్‌ భారతమ్మ, కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి, సతీమణి ఈసీ సుగుణమ్మ నివాళులర్పించారు. ఈసీ గంగిరెడ్డికి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ వైఎస్‌ ప్రమీలమ్మతో పాటు పలువురు వైఎస్‌ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, అభిమానులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 

Back to Top