రామచంద్రపురం: రామచంద్రపురం టౌన్ 21వ వార్డు రత్నంపేటలో ‘గడపగడపకు వైయస్‌ఆర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వైయస్ఆర్‌సీపీ రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పాల్గొని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లి సూర్యప్రకాష్ స్థానిక ప్రజల సమస్యలు, వార్డు అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ 21వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే 21వ వార్డు అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సూర్యప్రకాష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.