న‌ర‌స‌న్న‌పేట‌లో టీడీపీకి షాక్‌!

 ధర్మాన కృష్ణదాస్‌ సమక్షంలో 25 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక 

శ్రీ‌కాకుళం జిల్లా: నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగాంలో టీడీపీకి చెందిన 25 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం మబగాంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, యువనేత ధర్మాన కృష్ణచైతన్య వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

టీడీపీ నాయకులు మెండ కృష్ణమూర్తి (కిత్తయ్య), పల్లి భైరాగి, జుత్తు రామారావు, శిమ్మ రమేష్‌, కొప్పుల అప్పారావు, నక్క సూర్యనారాయణ, తెలుగు రామారావు, గొద్దు ప్రసాద్‌ తదితరులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పార్టీ కోసం కష్టపడుతున్న వారికి తగిన గుర్తింపు, అవకాశాలు లభించడం లేదని చేరిన నాయకులు పేర్కొన్నారు.

మబగాం అభివృద్ధితో పాటు పార్టీ కోసం కష్టపడే ప్రతి నాయకుడు, కార్యకర్తకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. మబగాంలో తాజా చేరికలతో వైయ‌స్ఆర్‌సీపీకి మరింత బలం చేకూరిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.  

Back to Top