గురజాల: దాచేపల్లి పట్టణం, మండలానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాచేపల్లి పట్టణంలోని సీపీఐ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పార్టీ శ్రేణులకు ఐడీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో దాచేపల్లి పట్టణ, మండలానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.