మెగా డీఎస్సీలో మరో భాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగం? 

 కడప: కడప మెగా డీఎస్సీలో నకిలీ కుల ధృవీకరణ పత్రంతో రసూల్‌ అనే వ్యక్తి ఉద్యోగం పొందారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2008, 2012, 2018 డీఎస్సీల్లో బీసీ-ఈ సర్టిఫికెట్‌ సమర్పించిన రసూల్‌.. 2025 మెగా డీఎస్సీలో ఓసీ-ఈడబ్ల్యూఎస్‌గా నమోదు చేసుకున్నారని జమీల్‌ ఫిర్యాదు చేశారు. దీంతో తనకు రావాల్సిన ఉద్యోగం రసూల్‌కు దక్కిందని ఆరోపించారు.

ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు తప్పుడు సర్టిఫికెట్‌ సమర్పించినట్లు నిర్ధారించినట్లు సమాచారం. తహసీల్దార్‌ ఇచ్చిన ఓసీ-ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ను మెగా డీఎస్సీలో అక్రమంగా ఉపయోగించారని ఆర్డీవో చంద్ర మోహన్‌ నివేదికలో పేర్కొన్నారు. తదుపరి చర్యల కోసం 2025 డిసెంబర్‌లో కలెక్టర్‌కు నివేదిక పంపినా ఇప్పటివరకు చర్యలు లేవని జమీల్‌ ఆరోపిస్తున్నారు. రసూల్‌ ఇప్పటికీ సుండుపల్లి మండలంలో ఉద్యోగం కొనసాగిస్తున్నాడు.

Back to Top