తాడేపల్లి: చైనా మాస్టర్స్ సూపర్-750 టైటిల్‌ను గెలుచుకున్న భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ రెడ్డి–చిరాగ్ శెట్టికి వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. చైనా మాస్టర్స్ సూపర్-750 టైటిల్ నెగ్గిన తొలి భారతీయులుగా నిలిచినందుకు సాత్విక్–చిరాగ్ జోడీకి శుభాకాంక్షలు తెలిపారు. వారి అద్భుతమైన పునరాగమనాన్ని ప్రశంసిస్తూ, పట్టుదల, దృఢ సంకల్పం, పోరాట స్ఫూర్తి యావత్ దేశానికి గర్వకారణమని వైయస్ జగన్ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లోనూ మరెన్నో విజయాలు సాధించి దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.