స్థానిక సంస్థల ఎన్నికలకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల సమాయత్తం

  పెనుకొండ, పరిగి మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ

పెనుకొండ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ కార్యక్రమాలు నిర్వహించారు. పెనుకొండ మండలంలోని మునిమడుగు, గుట్టూరు, పరిగి మండలంలోని కొడిగెనహళ్లి, శ్రీరంగరాజుపల్లి గ్రామ పంచాయతీల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై దృష్టి సారించాలని ఉషశ్రీ చరణ్‌ సూచించారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పిస్తూ, అందరూ ఐకమత్యంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గ్రామాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించుకోవాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎన్నికలకు సమష్టిగా సిద్ధం కావాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Back to Top