కర్నూలు: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో గాయపడి కర్నూలులోని అమీలియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిప్పగిరి గ్రామానికి చెందిన పిల్లెలి కదిరమ్మను ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి, ఆయన సోదరుడు బుసినె శ్రీరాములు పరామర్శించారు. కదిరమ్మ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో బాధితురాలిని పరామర్శించి, వైద్య సేవలపై వివరాలు తెలుసుకోవడం ద్వారా కుటుంబానికి ధైర్యం కల్పించారు.