వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై రౌడీషీట్ల ప్రక్రియను నిలిపివేయాలి

చట్టవిరుద్ధంగా రౌడీషీట్లు తెరవడంపై గుంటూరు ఎస్పీకి వైయ‌స్ఆర్‌సీపీ నేతల వినతి

గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులతో పాటు పార్టీ కీలక నేతలపై పోలీసులు రౌడీషీట్లు తెరిచే ప్రక్రియ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు గుంటూరు ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు నేత‌లు వినతిపత్రం అందించారు. ఈ ప్రక్రియ చట్టవిరుద్ధమని పేర్కొంటూ, నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకోకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, డైమండ్‌ బాబు, బలసాని కిరణ్‌కుమార్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top