పసుపల్లిలో ` గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్‌సీపీ`  

స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని గన్నవరపు శ్రీనివాసరావు పిలుపు

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా: పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం పసుపల్లి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో గడపగడపకూ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని వివరించారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని, 2029లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్‌, మాజీ ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావుతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top