ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు మృతిపై వైయస్ జగన్ సంతాపం

తాడేప‌ల్లి: ఎన్‌సీసీ (నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ) లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఎమెరిటస్ డాక్టర్ ఏవీఎస్ రాజు (89) మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు.

నిర్మాణ, మౌలిక వసతుల రంగంలో సుదీర్ఘకాలం విశేష సేవలందించి, ఎన్‌సీసీని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థగా తీర్చిదిద్దడంలో ఏవీఎస్ రాజు కీలక పాత్ర పోషించారని  వైయస్ జగన్ పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం లభించడం ఆయన ప్రతిభకు, కృషికి నిదర్శనమన్నారు.

ఏవీఎస్ రాజు మృతి నిర్మాణ రంగానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఎన్‌సీసీ సంస్థకు చెందిన ప్రతి ఒక్కరికీ శ్రీ వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top