తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ దృశ్యాలను భద్రపరిచి సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. చెవిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఘటనలపై నివేదిక సమర్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. పోలింగ్ కేంద్రాల సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ దృశ్యాలను పరిశీలించి, ఫిర్యాదులోని అంశాలపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సూచించింది. రీపోలింగ్ నిర్వహించాలన్న ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చేపట్టే తదుపరి చర్యలు కీలకంగా మారాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.