అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో పోలింగ్ వేళ టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనలపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి బయలుదేరిన మాజీ మంత్రి శైలజానాథ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, శైలజానాథ్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో చోటుచేసుకుంటున్న ఘటనలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న మాజీ మంత్రిని అడ్డుకోవడంపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను స్వేచ్ఛగా విధులు నిర్వహించేందుకు అనుమతించాలని, ఫిర్యాదులు స్వీకరించి పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ వర్గాలు కోరుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసులు, అధికారులు వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.