రాష్ట్రంలో పతనావస్థలో పోలీస్‌ వ్యవస్థ

వెన్నుపోటు పార్టీకి తోలుబొమ్మల్లా పోలీసులు

టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఫైర్‌

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు.

పరిషత్‌ ఎన్నికల్లో పరాకాష్టకు అరాచకాలు

వెన్నుపోటు పార్టీ మరింత బరితెగింపు

టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజం

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలను వెన్నుపోటు పార్టీ పూర్తిగా అపహాస్యం చేస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఫైర్‌ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా మారిందని ధ్వజమెత్తారు. అందుకే గతంలో ఎప్పుడూ హింసాత్మక ఘటనలు జరగని బూత్‌లలో సైతం ఇప్పుడు దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పారు. కొన్ని చోట్ల ఏకంగా పోలీసులే ఓటర్లను అడ్డుకోవడం అత్యంత హేయమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీజేఆర్‌ సుధాకర్‌బాబు తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పరాకాష్టకు అరాచకాలు: 
    రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం, నోటీసులు ఇవ్వడం, హౌస్‌ అరెస్టులు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు టీడీపీ నాయకులు, గుండాలకు రిగ్గింగ్‌లు, పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి బలమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు, నారా లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ ఘర్షణలు సృష్టించే వ్యూహాలు అమలు చేస్తున్నారు. గతంలో ఎలాంటి గొడవలు జరగని పోలింగ్‌ కేంద్రాల్లోనూ నేడు దాడులు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే ఓటమి తప్పదన్న భయంతోనే చంద్రబాబు అంతులేని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

దిగజారిన పోలీస్‌ వ్యవస్థ. తోలుబొమ్మల్లా పోలీసులు:
    ఇతర ప్రాంతాల నుంచి గుండాలను తీసుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ చంద్రబాబుకు తొత్తుగా మారి టీడీపీ గుండాలకు అండగా నిలుస్తోంది. వైయస్సార్‌ కడప జిల్లాలో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిని డీఎస్పీ మురళీనాయక్‌ అడ్డుకోవడం, పాలపర్తిలో ఏజెంట్‌ పత్రాలను చింపివేయడం, పులివెందులలో బీటెక్‌ రవి పోలింగ్‌ బూత్‌లలో తిష్టవేసి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. లింగాల మండలంలో సాక్షి విలేకరి పుల్లారెడ్డిపై టీడీపీ గుండాలు దాడి చేసి ఫోన్‌ ధ్వంసం చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. 
    మున్సిపల్‌ ఎన్నికల మాదిరిగానే పరిషత్‌ ఎన్నికల్లో కూడా యథేచ్ఛగా రిగ్గింగ్‌ జరుగుతోంది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లబ్రెడ్డిపల్లెలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు లాగేశారు. ఇంకా పులివెందుల, శ్రీకాకుళం, అనంతపురం, నంద్యాల, సత్యసాయి, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, కందుకూరు, సింగనమల, చంద్రగిరి, పుంగనూరు ప్రాంతాల్లో పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ చేసి యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేస్తున్నారని, అయినా ఎన్నికల అధికారులు, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆక్షేపించారు.

Back to Top