తాడేపల్లి: పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ రాష్ట్రవ్యాప్తంగా కూటమి శ్రేణులు రెచ్చిపోయాయి. వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లు, అభ్యర్థులను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు పంపిస్తూ, పలువురిని పోలీస్‌స్టేషన్లకు తరలిస్తూ ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు రిగ్గింగ్‌కు పాల్పడగా, ఓటర్లను అడ్డుకోవడం, దాడులు చేయడం, పెట్రోల్ బాంబులు, రాళ్లు, కర్రలతో దాడులకు దిగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అరాచకాలు పులివెందుల, లింగాల: ఇప్పట్లలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడింది. కొత్తపల్లిలో ఓటర్లను అడ్డుకున్నారు. ఎర్రిపల్లిలో పోలింగ్ కేంద్రాల వద్ద కర్రలతో హల్‌చల్ చేస్తూ పెట్రోల్ బాంబులతో దాడులకు దిగడంతో భారీ మంటలు చెలరేగాయి. పార్నపల్లిలో బీటెక్ రవి దగ్గరుండి రిగ్గింగ్ చేయించాడు. పులివెందుల, అచేపల్లి: టీడీపీ, వైయస్ఆర్‌సీపీ వర్గాల మధ్య రాళ్లదాడులు జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. రైల్వేకోడూరు, పెనగలూరు: నల్లపురెడ్డిపల్లిలో టీడీపీ వర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులకు దిగాయి. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. కుప్పం, రామకుప్పం: బొమ్మనపల్లిలో వైయస్ఆర్‌సీపీ వర్గాలను అక్రమంగా అరెస్టు చేశారు. రాప్తాడు: కనగానపల్లి మండలం బద్దలాపురంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త పూజారి హరిపై టీడీపీ వర్గాలు దాడి చేశాయి. రిగ్గింగ్ జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. శింగనమల: సోదనపల్లిలో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు పంపి టీడీపీ రిగ్గింగ్ చేసింది. అధికారులను బెదిరించి పోలింగ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. అనంతపురం: ఎమ్మెల్యే సురేంద్రబాబు తనయుడు అనుచరులతో కలిసి పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు. అనంతపురం రూరల్‌లో వైయస్ఆర్‌సీపీ నాయకులను పోలీసులు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. కదిరి: టీడీపీ నేతలు స్థానికేతరులతో దొంగ ఓట్లు వేయించారు. వైయస్ఆర్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి వజ్రా భాస్కర్‌రెడ్డి పోలీసులను నిలదీశారు. స్థానికేతరులను పోలింగ్ కేంద్రాల్లోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కర్నూలు, తొలిసాపురం: టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓట్లు వేసుకున్నారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తున్నా పోలీసులు చోద్యం చూశారు. చంద్రగిరి: రిగ్గింగ్‌కు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని కుట్రకు తెరతీశారు. పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వర్గాలు భారీగా మోహరించాయి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. పులివర్తి నాని సతీమణి కూడా చెవిరెడ్డిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. పల్నాడు, సత్తెనపల్లి: ధూళిపాళ్ల పోలింగ్ బూత్‌లోకి టీడీపీ వర్గాలు చొరబడి రిగ్గింగ్ చేశాయి. గొట్టుముక్కలలో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను ఎస్‌ఐ వినోద్ అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పల్నాడు, శంకరాపురం–భట్టుపాలెం: వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను సీఐ సుబ్బానాయుడు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. శ్రీకాకుళం, ఆకాశలక్కవరం: పోలింగ్ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్ చేసి వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను బయటకు గెంటేసింది. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా దాడులు జరిగాయి. టెక్కలి: వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి ఉషారాణి కుమారుడు పృథ్వీ, మాజీ ఎంపీటీసీ శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైయస్ఆర్‌సీపీ ఏజెంట్ల ఫారాలను టీడీపీ వర్గాలు చించేశాయి. దర్శి: తానంచింతల గ్రామంలో ఓటు వేయకుండా టీడీపీ వర్గాలు అడ్డుకుని రిగ్గింగ్‌కు పాల్పడటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాస: దేవునల్తాడ పోలింగ్ కేంద్రం వద్ద కోండి వీధి ప్రజలను అడ్డుకోవడంతో మహిళలు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం: గుంటుపల్లి పోలింగ్ కేంద్రంలోకి కారును అనుమతించాలని టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఐదు నిమిషాల్లో ఉద్యోగం తీసేయిస్తానంటూ పోలీసులను బెదిరించారు. ఎన్టీఆర్ జిల్లా, వత్సవాయి: దబ్బాకుపల్లి, పోలంపల్లి, వత్సవాయి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలీసులు బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైయస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరుగుతుండటంతో కూటమి శ్రేణులు పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డాయి. విశాఖ, భీమిలి: రాయనిపేట గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం, కందుకూరు: బబేవారిపాలెంలో టీడీపీ వర్గాలు పోలింగ్ బూత్‌లోకి చొరబడి వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపించాయి. ప్రకాశం, టంగుటూరు: కొణిజేడు బూత్ వద్ద టీడీపీ 150 మంది బౌన్సర్లను మోహరించి వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులను అడ్డుకుంది. నంద్యాల: శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిని హౌస్‌అరెస్ట్ చేశారు. వైయస్ఆర్‌సీపీ నేతలపై కేసులు పెట్టి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు హల్‌చల్ చేశారు. విఖ్యాత్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో హడావుడి చేశారు. సత్యసాయి జిల్లా, కదిరి: టీడీపీ నేతలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. స్థానికేతరులను పోలింగ్ కేంద్రాల్లోకి ఎలా అనుమతించారని వైయస్ఆర్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి వజ్రా భాస్కర్‌రెడ్డి పోలీసులను నిలదీశారు. పెద్దముడియం: వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరవ భాస్కర్‌బాబు, జడ్పీటీసీ అభ్యర్థి అరవ శ్రీకళపై టీడీపీ వర్గాలు దాడికి దిగాయి. అమదాలవలస: పొందూరు మండలం గోకర్ణపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్కాపురం జిల్లా, కనిగిరి: సీఎస్‌పురం మండలం బోయమడుగుల పోలింగ్ కేంద్రంలో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లుగా ఉన్న పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కడప జిల్లా, బద్వేలు: గోపవరం మండలం ఎస్.రామాపురంలో పోలీసులు దగ్గరుండి రూములకు తాళాలు వేయించి రిగ్గింగ్‌కు సహకరించారు. కర్నూలు, చిప్పగిరి: ఎస్‌ఐ నరసింహులు వైయస్ఆర్‌సీపీ జడ్పీటీసీ రూట్ ఏజెంట్లను అరెస్టు చేసి పోలీస్ జీపులోకి ఎక్కించారు. వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా తీసుకెళ్లారు. కర్నూలు, కృష్ణగిరి: వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలీసులు నిర్బంధించారు. పోలింగ్ బూత్‌లకు వెళ్తే పీడీ యాక్ట్ పెడతామని బెదిరించారు. ఎక్కడికక్కడ ఏజెంట్లను అడ్డుకున్నారు. అనంతపురం రూరల్: వైయస్ఆర్‌సీపీ నాయకులను ఆర్ఎస్‌ఎస్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా ఉంచిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నంద్యాల, చాబోలి: పోలింగ్ బూత్ సమీపంలో పచ్చ కండువాలు ధరించిన అధికార పార్టీ నాయకులు ఓట్లు అభ్యర్థించారు. పోలింగ్ సమయంలోనే ప్రచారం సాగించడంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగింది. ఏలూరు, నూజివీడు: చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి సూరిబాబు అనుచరులను, మహిళలను టీడీపీ నేతలు, కార్యకర్తలు బెదిరించారు. ఆటోలకు టీడీపీ జెండాలు కట్టి జనాలను సమీకరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా: అనంతగిరి మండలం దెబ్బలపాడు గిరిజనులు ఏడు కిలోమీటర్ల డోలీ మోత ప్రయాణం చేసి రొంపిల్లి పంచాయతీ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంపై గిరిజనులు చూపిన ఈ నిబద్ధత స్ఫూర్తిదాయకం. నెల్లూరు, ఆత్మకూరు: బొటికర్లపాడు పోలింగ్ కేంద్రం వద్ద కూటమి నేతల అరాచకాలపై మండల జడ్పీటీసీ అభ్యర్థి పెమ్మసాని లక్ష్మీప్రసన్న మీడియాతో మాట్లాడారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ వైయస్ఆర్‌సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి శక్తులు సాగించిన దాడులు, నిర్బంధాలు, బూత్‌ల వద్ద జోక్యాలతో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రజల ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఎన్నికల యంత్రాంగం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.