శ్రీ సత్యసాయి జిల్లా: ఎన్నికల వేళ ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో వైయస్ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి పోలీసులు ఎత్తుకెళ్తున్నారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. కదిరిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతూ స్థానికేతరులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి వజ్రా భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరులను పోలింగ్ కేంద్రాల్లోకి ఎలా అనుమతిస్తారని పోలీసులను నిలదీయడంతో ఆయనకు పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు పులివెందుల నియోజకవర్గం నలిపిరెడ్డిపల్లి పంచాయతీ ఎర్రబల్లి గ్రామంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండా పోలీసులు, టీడీపీ వర్గాలు అడ్డుకుంటున్నాయని వైయస్ఆర్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.