నంద్యాల జిల్లా: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ గోస్పాడు మండలంలో టీడీపీ నేత భూమా జగత్ విఖ్యాతిరెడ్డి భారీ కాన్వాయ్‌తో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన టీడీపీ నేతకు ఇంత భారీ కాన్వాయ్‌తో పర్యటించేందుకు అనుమతులు ఉన్నాయా అనే ప్రశ్నలు స్థానికంగా తలెత్తుతున్నాయి. ఎన్నికల నియమావళి వైయస్ఆర్‌సీపీ నాయకుల విషయంలో కఠినంగా అమలు చేస్తూ, అధికార పార్టీ నేతల విషయంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ కాన్వాయ్ పర్యటనకు అనుమతులు ఉంటే వాటి వివరాలను అధికారులు వెల్లడించాలని, లేకుంటే నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు, ఎన్నికల యంత్రాంగం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి అన్ని పార్టీలకు ఒకే నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. గోస్పాడులో భూమా జగత్ విఖ్యాతిరెడ్డి పర్యటనకు సంబంధించి అనుమతులు ఉన్నాయా? ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించారా? అనే అంశాలపై అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.