గుంటూరు: వెంగళాయపాలెంలో పోలింగ్ పూర్తయిన అనంతరం స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తున్న బ్యాలెట్ బాక్సును నల్లపాడు సెంటర్‌లో దించి పక్కకు తీసుకెళ్లడంపై వివాదం తలెత్తింది. బ్యాలెట్ బాక్సును టీడీపీ వర్గాల వద్దకు తరలించి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి అడ్డుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో బ్యాలెట్ బాక్సు తరలింపును నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నల్లపాడులో రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నల్లపాడుకు చేరుకుని ధర్నాలో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేసి బ్యాలెట్ బాక్సును తమ ఆధీనంలోకి తీసుకెళ్లారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సిబ్బందిని అడ్డుకుని బ్యాలెట్ బాక్సును తమ ఆధీనంలోకి తీసుకున్నారన్న కేసులో లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పిరెడ్డిని తొలుత నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆయనపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇవాళ అప్పిరెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.