శ్రీకాకుళం జిల్లా: టెక్కలి నియోజకవర్గంలోని టెక్కలి ఎంపీటీసీ 4వ ప్రాదేశికం వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి మామిడి జ్యోతి సోదరుడు మామిడి కృష్ణను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ చర్యను అడ్డుకున్న జ్యోతిపై పోలీసులు దాడికి పాల్పడ్డారని వైయస్ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. మహిళ అని కూడా చూడకుండా ఓ పోలీసు అధికారి ఆమె మెడపై లాఠీ పెట్టి నెట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వేధింపులకు పాల్పడటం సరికాదని వైయస్ఆర్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మామిడి కృష్ణను అరెస్టు చేయడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించాలని, మహిళా అభ్యర్థి పట్ల దురుసుగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.