లింగంగుంట్ల పోలింగ్‌ కేంద్రం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి

  టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త

మార్కాపురం జిల్లా: కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలం లింగంగుంట్ల పంచాయతీ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రం సమీపంలో టీడీపీ వర్గీయులు జరిపిన దాడిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త గాయపడ్డారు. ఎన్నికల వేళ పోలింగ్‌ కేంద్రం వద్ద దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాయపడిన కార్యకర్తకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి.

Back to Top