బడేవారిపాలెం ఎంపీటీసీ పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌ కలకలం

ప్రకాశం జిల్లా: ఓలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం ఎంపీటీసీ పోలింగ్‌ బూత్‌లో టీడీపీ నాయకులు భారీగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి సమక్షంలోనే వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సుధాకర్‌పై దాడి చేసి, పోలింగ్‌ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగి పడేశారని పేర్కొన్నాయి. ఈ ఘటనపై పోలింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విధుల్లో ఉన్న పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Back to Top