బూత్‌ క్యాప్చరింగ్‌కు ప్రయత్నిస్తే ప్రజలు అడ్డుకోవాలి

శ్రీ‌శైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పిలుపు

అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు బూత్‌లలోకి వెళ్లి భయభ్రాంతులకు గురిచేయడాన్ని అడ్డుకోవాలి

గ్రామాల్లో దౌర్జన్యాలు, బెదిరింపులను ఎక్కడికక్కడ వీడియో తీయాలి

పోలీసుల సమక్షంలోనే ప్రజలకు భద్రత కల్పించాలి

ప్రశాంతమైన గ్రామాల్లో ఎన్నికల పేరుతో కుంపట్లు పెట్టొద్దు

ఓటర్లను బెదిరిస్తే బ్యాలెట్‌ ద్వారా ప్రజలు సమాధానం చెప్పాలి: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి 
 

నంద్యాల జిల్లా: పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ వేళ బూత్‌లలోకి చొరబడి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే టీడీపీ నేత‌ల ప్రయత్నాలను ప్రజలే అడ్డుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు బూత్‌లలోకి వెళ్లి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో జరుగుతున్న దౌర్జన్యాలు, బెదిరింపులను ప్రజలు ఎక్కడికక్కడ వీడియో తీసి ఆధారాలను భద్రపరచాలని సూచించారు. 
మీడియాతో శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి మాట్లాడారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..

- బూత్‌ క్యాప్చరింగ్‌కు ప్రయత్నిస్తే ప్రజలే అడ్డుకోవాలి

“ఎక్కడైనా బూత్‌ క్యాప్చరింగ్‌కు ప్రయత్నిస్తే ప్రజలు భయపడకుండా అడ్డుకోవాలి. ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే హక్కు ఎవరికీ లేదు. ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజల సమక్షంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. బూత్‌లను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు.”

- బూత్‌లలోకి నేతలు, ఎమ్మెల్యేలు వెళ్లడాన్ని అడ్డుకోండి

“అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు బూత్‌లలోకి వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తే ప్రజలు, ఎన్నికల సిబ్బంది, పోలీసులు అడ్డుకోవాలి. బూత్‌లలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.”

- దౌర్జన్యాలు, బెదిరింపులను వీడియో తీసి ఆధారాలు భద్రపరచాలి

“గ్రామాల్లో ఎక్కడైనా దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమాలకు పాల్పడితే ప్రజలు వెంటనే వాటిని వీడియో తీయాలి. జరుగుతున్న ప్రతి ఘటనకు సంబంధించిన ఆధారాలను భద్రపరచాలి. ఎవరు వచ్చారు, ఏం చేశారు అనే విషయాలను స్పష్టంగా రికార్డు చేస్తే భవిష్యత్‌లో చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి.ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది” అని శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి స్పష్టం చేశారు.

Back to Top