మంత్రి సవిత ఇలాకాలో గోరంట్ల సీఐ శేఖర్‌ దూకుడు

మహిళల పట్ల అనుచిత ప్రవర్తన
 

శ్రీ స‌త్య‌సాయి జిల్లా: శాంతియుతంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ఇళ్లపై గోరంట్ల సీఐ శేఖర్‌ దాడులకు పాల్పడటంతో పాటు, మహిళలను అసభ్య పదజాలంతో దూషించి మానసికంగా వేధించారని పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌ అక్కడికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పష్టం చేస్తూ, ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top