క‌ళ్లకు గంతలు కట్టుకుని మాజీ మంత్రి మేరుగు నాగార్జున నిరసన

పోలింగ్‌ కేంద్రాల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లకు అడ్డంకులు.. పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన

సంతనూతలపాడు: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ వేళ సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల్లోకి వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను అనుమతించకుండా టీడీపీ వర్గీయులు అడ్డుకుంటూ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనలను ప్రశ్నించేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల తీరుకు నిరసనగా రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ మేరుగు నాగార్జున అంబేద్కర్‌ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్లకు విధులు నిర్వహించే అవకాశం కల్పించాలని, అన్ని పార్టీలకు సమానంగా ఎన్నికల నిబంధనలు అమలు చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కోరారు.

Back to Top